శ్రీ యమునోత్రి సమగ్ర దర్శన సమాచారం

యమునోత్రి స్థలపురాణం తెలుగు

హిందూ పురాణాల ప్రకారం, యమునా దేవి సూర్య భగవానుని కుమార్తె మరియు మరణ దేవుడైన యమధర్మరాజుకు జంట సోదరి. పూర్వ కాలంలో అసిత మహర్షి అనే ముని ఇక్కడే ఆశ్రమం నిర్మించుకుని, ప్రతిరోజూ గంగా మరియు యమునా నదులలో స్నానం చేసేవారు. వృద్ధాప్యం వల్ల ఆయనేమీ చేయలేని స్థితిలో, ఆయన భక్తికి మెచ్చి యమునా దేవి ఇక్కడ చిన్న ప్రవాహంగా ఉద్భవించిందని ప్రతీతి. ఇక ఆలయ ప్రాంగణంలో ఉండే సూర్య కుండం, ఎముకలు గడ్డకట్టే చలిలో కూడా సెగలు పొగలతో మరుగుతూ ఉంటుంది. ఈ వేడి నీటిలో బియ్యాన్ని ఉడికించి అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. అలాగే దర్శనానికి ముందు పూజించే దివ్య శిల భక్తులకు మనశ్శాంతిని కలిగిస్తుందని విశ్వాసం.

The Mythological Story of YAMUNOTRI

According to Hindu mythology, Goddess Yamuna is the daughter of Lord Surya and the twin sister of the God of Death, Yamraj. In ancient times, sage Asit resided here, bathing daily in both the Ganga and Yamuna. As he aged, the Goddess Yamuna manifested as a small stream near his hermitage to allow him to continue his rituals uninterrupted. The temple complex is also home to Surya Kund, a hot spring that remains boiling even in the freezing cold. Priests cook raw rice in this thermal water as an offering, which is then distributed as Prasad. Visitors also worship Divya Shila, a sacred red rock, before seeking the blessings of Devi Yamuna.