శ్రీ గంగోత్రి సమగ్ర దర్శన సమాచారం

గంగోత్రి స్థలపురాణం తెలుగు

సూర్యవంశపు రాజైన సగరునకు కేశిని, సుమతి అను ఇద్దరు భార్యలు. కేశినికి అసమంజసుడను ఒక కుమారుడు, సుమతికి 60 వేల మంది కుమారులు కలిగారు.భగీరథుని ముత్తాత అయిన సగర రాజు ఒకసారి అశ్వమేధ యాగం చేస్తాడు. అయితే ఆ యాగం అశ్వాన్ని ఇంద్రుడు దొంగిలించి, పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేస్తున్న ప్రదేశంలో దేవత జంతువును నిర్బంధిస్తాడు. సగరుని 60,000 మంది కుమారులు పాతాళంలో నిర్బందించి ఉన్న గుర్రాన్ని కనుగొంటారు, అప్పుడు వారు తమ బొంగురు శబ్దాలతో కపిలమహర్షిని కలవరపరుస్తారు. కోపోద్రిక్తుడైన కపిలమహర్షిని సగరుని 60,000 మంది కుమారులు, ఋషి అగ్ని నేత్రాలచే బూడిదగా మారతారు.వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. అది పొందేవరకు సగరుని కుమారుల అంత్యక్రియలను నిర్వహించే బాధ్యత తరతరాలుగా సంక్రమించింది.భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిరోహించిన తరువాత, తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని, గంగా దేవిని ప్రార్థించడానికి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. భగీరథుడు దీక్షకు గంగాదేవి ప్రత్యక్షమై, స్వర్గం నుండి భూమికి దిగితే, తన దూకుడు శక్తిని నిలబెట్టుకోవడం కష్టమని, దానిని తట్టుకోవాలంటే జడలుకట్టిన జుట్టు, నీల కంఠం ఉన్న శివుడు మాత్రమే దానికి నిలబడశక్తి ఉందని, అందువలన శివుని అనుగ్రహం పొందమని గంగ భగీరథుడికి చెప్పింది.భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

భగీరథ ప్రయత్నం : ఈ పురాణ కథన ఆధారంగా భగీరథ ప్రయత్నం అనే మాట వాడుకలోకి వచ్చింది. అతని కృషికి గుర్తుగా, దేవప్రయాగ వద్ద అలకనంద నదిలో కలిసే వరకు నది ప్రధాన ప్రవాహాన్ని స్థానికులు భాగీరథి అని పిలుస్తారు. పాతాళం వైపు ప్రవహిస్తున్నప్పుడు, గంగ జహ్నవి మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. దేవత అహంకారాన్ని శిక్షించడానికి, ఋషి నదిని మింగేశాడు. భగీరథుని పట్టుదలతో కూడిన విన్నపంతో, ఋషి తన చెవి ద్వారా నదిని బయటకు నెట్టడానికి సమ్మతిస్తాడు. ఇది దేవతకు జాహ్నవి నది అనే పేరును తెచ్చి పెట్టింది.

The Mythological Story of GANGOTRI

Bhagirathaprayatnam King Sagara, the great-grandfather of Bhagiratha, once performed the ashvamedha sacrifice, but the sacrificial horse was stolen by Indra. The deity had the animal sequestered in Patala, where Sage Kapila was performing a penance. The 60,000 sons of Sagara discovered the horse in Patala, whereupon they disturbed Kapila with their hoarse noises. Infuriated, the 60,000 sons of Sagara were reduced to ash by the fiery eyes of the sage. The responsibility of performing the funeral rites of these sons passed down from generation to generation, until it was acquired by Bhagiratha, who upon his ascension to the throne of Ayodhya, went to practice austerities in the Himalayas, to invoke the goddess Ganga. Ganga told Bhagiratha that were she to descend from Svarga to the earth, the force of her fall would be difficult to sustain. She asked him to obtain the favour of the matted-haired, blue-throated deity Shiva, as no one except him would be able to sustain her. Heeding her words, the king then performed a penance that lasted for a millennium for Shiva at Kailasa, and sought his cooperation in allowing Ganga to flow through his hair. Shiva granted him the boon, and stood in position, even as the torrent of Ganga's stream rushed upon his hair. Ganga flowed along the matted hair of Shiva for a thousand years. Bhagiratha performed another penance to please Shiva, until the deity shook his hair and allowed a single drop to descend upon the Indo-Gangetic plain, which became the Ganges. For Bhagiratha, the river flowed along the plain to Patala, and performed the funeral rites of Sagara’s sons.[3] This episode is referred to as Bhagīrathaprayatnam, literally meaning, "Bhagiratha's labour".

        To commemorate his efforts, the head stream of the river is called
Bhagirathi by locals, till it meets the Alaknanda river at Devprayag. The mythical pātāla where the sage Kapila meditated is identified with the Sāgar Island, at the confluence of the Bhagirathi stream of the Ganges (flowing by Kolkata and revered as Ganga) and the Bay of Bengal. The sea (sam-udra) is called Sāgara in honour of Bhagiratha's ancestor the King Sagara. Kapila's ashrama is located at Sagar Island and hosts the annual Ganga Sagar Mela and bathing rituals on Makara Sankranti day every year.

       While flowing towards Patala, the Ganga flooded the
ashrama of Sage Jahnu. To punish the haughtiness of the goddess, the sage swallowed the river. It was with the insistent entreaties of Bhagiratha that the sage consented to push the river out through his ear, which offered the goddess the epithet Jahnavi.