శ్రీ బద్రీనాథ్ సమగ్ర దర్శన సమాచారం
బద్రీనాథ్ స్థలపురాణం తెలుగు
బద్రీనాథ్ :
హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో ఉన్న పంచాయితీ. చార్ ధామ్ (నాలుగు పట్టణాలు) లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ (6,560 మీటర్లు8 శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేథార్నాధ్‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నగర చరిత్ర :
బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమం (बद्रीकाश्रम) గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునినితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- కృష్ణుడు నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లు వర్ణించ బడింది.
గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తి వంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలీ నట్లూ దానిలో అలకనందానది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం.
బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.
స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాశారు.
బద్రీనాథ్ గుడి :
బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పాన్ని తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్ఠించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్దంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్తుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.
బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్దంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిథిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.
బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.
ప్రత్యేకత :
బద్రీనాథ్ ఆలయం ఆదిశంకరాచార్యులచే స్థాపించబడి అభివృద్ధి చెందిన వైష్ణవ దేవాలయం. ప్రస్తుత కాలంలో ఇది అధిక ప్రాముఖ్యత సంపాదించుకుంది. 2006 లో 6,00,000 భక్తులు సందర్శించినట్లు అంచనా. ఇది ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. భారతంలో ఇక్కడ బద్రికాశ్రమం ఉన్నట్లు సూచింపబడింది. కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణ మునిగాను అర్జునుడు నర ముని గాను జన్మించి నట్లు దుష్ట శిక్షణార్ధం, శిష్ఠ రక్షణార్ధం కృష్ణుడిగానూ అర్జునినిగానూ జన్మించినట్లు మహాభారత కథనం.
బద్రీ అంటే రేగుపండు నాధ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాధుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ (అలసట) తీర్చడానికి రేగుచెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.
తీర్ధయాత్ర :
బద్రీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌కు రెండు రోజుల ప్రయాణదూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్ (నాలుగు సౌధాలు) లలో ఇది మొదటిది. బద్రీనాథ్ పోయే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి. శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్, హేమకుండ్ కు వెళ్ళే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్ధం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబరుల మధ్యకాలం. స్వెట్టర్లు మొదలైన చలిని తట్టుకొనే దుస్తుల అవసరం సంవత్సరమంతా ఉంటుంది. బద్రీనాథ్, పరిసర పల్లెలను బస్సు మార్గంలో చేరవచ్చు. ఆదిశంకరాచార్యుడు ఉత్తరభారతంలో స్థాపించిన జ్యోతిమఠం బద్రీనాథ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఇతర పుక్ష్యక్షేత్రాలు హరిద్వార్, కేదార్‌నాధ్.
క్షేత్రమహిమ :
ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని, త్రేతాయుగంలో యోగసిద్దిద అని, ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి.జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటిని జ్ఞానం వలన నశింపచేసే క్షేత్రం కనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది.బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శివుడు కుమారస్వామికి వివరించాడు.ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది.ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్దవుడు రక్షింపబడ్డాడు.
The Mythological Story of BADRINATH
Badrinath :
Is a town and nagar panchayat in Chamoli district in the state of Uttarakhand, India. It is a Hindu holy place, and is one of the four sites in India's Char Dham pilgrimage. It is also part of India's Chota Char Dham pilgrimage circuit and gets its name from the Badrinath Temple.
Etymology :
Badrinath derives from the Sanskrit compound Badarīnātha, consisting of the terms badarī (jujube tree) and nātha (lord), an epithet of Vishnu. It is also known as Badarikashrama.
History :
In earlier days, pilgrims used to walk hundreds of miles to visit the Badrinath temple. The temple has been repeatedly destroyed by earthquakes and avalanches. As late as the First World War, the town consisted only of the 20-odd huts used by the temple's staff, but the site drew thousands each year and up to 50,000 on its duodecennial festivals (every twelve years). In recent years its popularity has increased still more, with an estimated 600,000 pilgrims visiting during the 2006 season, compared to 90,676 in 1961. The temple in Badrinath is also a sacred pilgrimage site for Vaishnavites. Badrinath is also gateway to several mountaineering expeditions headed to mountains like Nilkantha.
Temple :
The Badrinath temple is the main attraction in the town. According to the legend, Adi Shankaracharya discovered a black stone image of Lord Badrinarayan made of Shaligram stone in the Alakananda River. He originally enshrined it in a cave near the Tapt Kund hot springs. In the sixteenth century, the King of Garhwal moved the murti to the present temple. The temple is approximately 50 ft (15 m) tall with a small cupola on top, covered with a gold gilt roof. The facade is built of stone, with arched windows. A broad stairway leads up to a tall arched gateway, which is the main entrance. The architecture resembles a Buddhist vihara (temple), with the brightly painted facade also more typical of Buddhist temples. Just inside is the mandapa, a large pillared hall that leads to the garbha grha, or main shrine area. The walls and pillars of the mandapa are covered with intricate carving.
Legend :
According to the Bhagavata Purana, "There in Badrikashram, the supreme being (Vishnu), in his incarnation as the sages Nara and Narayana, had been undergoing great penance since time immemorial for the welfare of all living entities" (Bhagavata Purana 3.4.22).
The Badrinath area is referred to as Badari or Badarikaashram (बदरिकाश्रम) in Hindu scriptures. It is a place sacred to Vishnu, particularly in Vishnu's dual form of Nara-Narayana. Thus, in the Mahabharata, Krishna, addressing Arjuna, says, "Thou wast Nara in a former body, and, with Narayana for thy companion, didst perform dreadful austerity at Badari for many myriads of years."
As per one legend, when the goddess Ganga was requested to descend on earth to help the suffering humanity at the request of Bhagiratha, the earth was unable to withstand the force of her descent. Therefore, the mighty Ganga (Ganges) was split into two holy channels, with Alaknanda as one of them.
Another lore states that the area was full of Badari, a wild berry. Vishnu meditated here and Lakshmi took the form of the Badari tree to provide shade for him from scorching sun.
The mountains around Badrinath are mentioned in the Mahabharata, when the Pandavas were said to have died one by one, when ascending the slopes of a peak in western Garhwal called Swargarohini (literal meaning - the 'Ascent to Heaven'). The Pandavas passed through Badrinath and the town of Mana, 4 km north of Badrinath, on their way to Svarga (heaven). There is also a cave in Mana where Vyasa, according to the legend, wrote the Mahabharata.
The area around Badrinath was celebrated in Padma Purana as abounding in spiritual treasures.
This place is considered holy in Jainism as well. In Jainism, Himalaya is also called Ashtapad because of its eight different mountain range Gaurishankar, Kailash, Badrinath, Nanda, Drongiri, Nara-Narayana and Trishuli. Rishabhanatha attained Nirvana on Mount Kailash situated in the Himalayan range and according to Jain faith (Nirvankand), from Badrinath numerous Jain Muni got Moksha by doing Tapsya. According to Shrimadbhagwat, at this place Rishabhdev's father Nabhirai and mother Marudevi had done hard Tapa after Rishabhdev's Rajyabhishek and taken Samadhi. Even today footprint of Nabhirai at Neelkanth mountain attracts every body towards him.
Geography :
Badrinath has an average elevation of 3,100 metres (10,170 feet). It is in the Garhwal Himalayas, on the banks of the Alaknanda River. The town lies between the Nar and Narayana mountain ranges 9 km east of Nilkantha peak (6,596m). Badrinath is located 62 km northwest of Nanda Devi peak and 301 km north of Rishikesh. From Gaurikund (near Kedarnath) to Badrinath by road is 233 km.